Friday, January 10, 2025

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదమశాత్తు కరెంట్ షాక్ కు గురైన యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట శిరిడి హిల్స్‌కు చెందిన మొక్కల శానమ్మ కుమారుడు వడ్డే చంద్రశేఖర్ (20) అనే యువకుడు గురువారం జగద్గిరిగుట్ట ఆర్ జీకేలో ప్లంబర్ పనికి వెళ్ళాడు. అక్కడ నిచ్చెన అవసరం ఉండగా తన చిన్న కుమారుడు శ్రీకాంత్‌తో ఇనుప నిచ్చెన తీసుకుని వస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగల తగిలి ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయారు. హుటాహుటిగా వారిని రాందేవ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యం పొందుతూ వడ్డే చంద్రశేఖర్ 11:30 నిమిషాలకు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ముత్తడి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News