Sunday, December 22, 2024

బైక్ ను ఢీకొట్టిన కారు: లారీ కింద పడి యువకుని మృతి

- Advertisement -
- Advertisement -

తంగళ్లపల్లి ః లారీని ఓవర్‌టేక్ చేస్తు వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో లారీ కిందపడి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పద్మనగర్ గ్రామ శివారులో సోమవారం  తెల్లవారుజామున చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే..సిరిసిల్ల పట్టణానికి చెందిన బిట్ల మహేందర్(27),బిట్ల అఖిల్‌ను ద్విచక్ర వాహనంపై సిద్దిపేట వైపు వెళుతున్నారు. పద్మనగర్ శివారులో లారీని ఓవర్ టేక్ చేసి రాంగ్ రూట్‌లో వస్తున్న కారు అద్దం బైక్ కి తగలడంతో అదుపుతప్పి లారీ కిందకి దూసుకెళ్లారు.బైక్ వెనుక కూర్చున్న మహేందర్ లారీ టైర్ల కిందపడి నుజ్జు నుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు.

కాగా అఖిల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని లారీ కింద నుండి తీసి ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.ఐతే పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లో ప్రమాదం జరగాడానికి గల కారణాలను సిసి కెమెరాల్లో రికార్డు ఐన దృశ్యాలను పోలీసులు పరిశీలించారు.ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన వ్యక్తి పక్కనే ఉన్న రైస్‌మిల్లులోకి పరిగెత్తడం కనిపించింది.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు కారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.మరో యువకుడు సిరిసిల్లలోని రెస్టారెంట్‌లో వర్కర్‌గా పనిచేస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News