Sunday, December 22, 2024

రాగిడి ఎన్నికల ప్రచారంలో అపశృతి

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ప్రచారంలో డిజే వాహనం బ్రేకులు ఫేయిల్ అయి వాహనం మీదికి రావడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన బోడుప్పల్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బిఆర్‌ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈ సంఘటన జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే డీజే వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా వాహనం ర్యాలీలో ఉన్న జనాల పైకి దూసుకు వచ్చింది. దీంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి.

పోలీసుల కథనం ప్రకారం…ఎన్నికల ప్రచారంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు బోడుప్పల్ కార్పొరేషన్ దేవేందర్ నగర్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి తో కలసి బీఆర్‌ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కోసం ఏర్పాటు చేసిన డీజే వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి ర్యాలీలో ఉన్న వారిని ఢీకొట్టింది. దీంతో కల్యాణిపురికి చెందిన శ్రవణ్ (24) అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News