Friday, January 10, 2025

ఈ మధ్యనే పోస్టాఫీస్‌లో ఉద్యోగం..అంతలోనే మృత్యు ఒడిలోకి

- Advertisement -
- Advertisement -

కేశంపేట: ఈ మధ్యనే పోస్టాఫీస్‌లో ఉద్యోగం వచ్చింది. అదే పని నిమిత్తం వెళుతున్న ఆ యువకున్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించిన సంఘటన మండల పరిధిలోని లేమామిడి గ్రామపంచాయతీ గాంధీశంకర్‌పల్లి వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తలకొండపల్లి మండలం పాతకోట తండాకు చెందిన పాత్లావత్ నవీన్, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జయప్రకాష్‌నగర్ తండాకు చెందిన పాత్లావత్ యుగేందర్ (21)లు హోండా యాక్టివా వాహనంపై షాద్‌నగర్ వెళ్తున్నారు.

లేమామడి గ్రామపంచాయతీ గాంధీ శంకర్‌పల్లి వద్దకు రాగానే తమ ముందు వెళ్తున్న బైక్ ను అతివేగంగా ఢీకొనడంతో యాక్టివా వెనక కూర్చున్న యుగేందర్ బైక్ పై నుంచి పడడంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.యాక్టివా నడుపుతున్న పాత్లావత్ నవీన్ తీవ్రగాయాల పాలుకావడంతో హైదరాబా ద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. బైక్ నడుపుతున్న నవీన్‌రెడ్డి అనే వ్యక్తి కూడా గాయాల పాలయ్యాడు. మృతుని తల్లి పాత్లావత్ లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News