Sunday, December 22, 2024

పండుగ పూట విషాదం

- Advertisement -
- Advertisement -

నల్లబెల్లి: పండుగ పూట మండలంలోని బజ్జుతండా గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం    ప్రకారం .. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తేజావత్ పరమేశ్(25), తేజావత్ వెంకటేశ్, తేజావత్ రాకేష్‌లు ఉదయాన్నే టిఫిన్ చేయడానికి రుద్రగూడెం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న సందర్భంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడటంతో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యంలో తేజావత్ కొమ్మాలు సునీత కుమారుడు పరమేశ్ మృతి చెందినట్లు తెలిపారు. వెంకటేశ్ పరిస్థితి విషమంగా ఉండగా రాకేష్ కాలు విరిగినట్లు గ్రామస్థులు తెలిపా రు. కాగా హైదరాబాద్ పట్టణంలో ప్రయివేటు ఉద్యోగులుగా పనిచేస్తున్న యువకులు దసరా పండుగ సందర్భంగా ఇళ్లకు చేరుకున్నారని ఈ లోగా ఇలా జరిగిందని బోరుమంటూ శోక సముద్రంలో మునిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News