Sunday, December 22, 2024

ఒఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ : శంషాబాద్ ఓఆర్‌ఆర్ ఔటర్ రింగ్ రోడ్డుపై డిసిఎం వాహనం బోల్తా పడి యువకుడు మృతి చెందిన సంఘటన పెద్ద గోల్కొండ వద్ద జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న రూలర్ పోలీసులు ఎండి మొహమ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, రూలర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఎండి మొహమ్మద్ తండ్రి లతీఫ్ వృత్తి రీత్యా డ్రైవర్ గా పని చేస్తున్నాడు కందుకూర్ మండల్ గుమ్మడి వెళ్లి గ్రామానికి చెందిన ఎండి మహమ్మద్ గురువారం ఉదయం ఎనిమిది గంటలకు తన వాహనం డీసీఎం ఆర్‌ఎంసి ప్లాంట్ లో నడుపుతున్నాడు. డీసీఎం AP 31 TA 6736 వాహనం నడుపుతూ తోటి కంపెనీలో పనిచేసే నలుగురి లేబర్ లను తీసుకొని తుక్కుగూడ ఓఆర్ నుండి శంషాబాద్ వస్తుండగా మార్గమధ్య పెద్ద గోల్కొండ వద్దకు

రాగానే వెనకాల నుండి మరో వాహనం డీసీఎం MH 14 LB 8281 డీసీఎం ఐచర్ వాహనం తాను నడుపుతున్న వాహనాన్ని వెనుకాల నుండి బలంగా గుద్దడంతో డీసీఎం వాహనానికి వెనకాల ఉన్న కాంక్రీట్ పంప్ రెండు బోల్తాపడి వాహనం లో ఉన్న నలుగురు వ్యక్తులలో ఒకరు సూరజ్ కుమార్ 20 సం, s/o శోభానాథ్ కిందపడి తలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు మిగతా ముగ్గురు అరుణ్ కుమార్, విక్రమ్, జగదీష్, వ్యక్తులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఇట్టి ప్రమాదానికి కారకుడైన వారిపై తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు తెలిపారని తెలిపారు. ఈ సంఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News