Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

గాంధారి : గాందారి మండల కేంద్రంలో శనివారం అర్దరాత్రి జరిగి న రోడ్డు ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన విక్రమ్ గౌడ్ 19 అనే యువకుడు మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు కుమ్మరి లింగమేశ్వర్ పుట్టిన రోజు వేడుకలకు తన మరో స్నేహితుడైన సునుగురు సందీప్ యొక్క బైక్ పై వెళ్లాడు. వేడుకలు ముగించుకుని తిరిగి వస్తుండగా మార్గమద్యలో గాందారి గ్రామ పంచాయతీ వద్ద బైక్ అదపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న విక్రమ్ గౌడ్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మద్యలో కూర్చున్న లింగమేశ్వకు గాయాలయ్యాయి. సందీప్ వాహనాన్ని అతివేగంగా నిర్లక్షంగా నడుపడం వల్లే ప్రమాదం జరిగి విక్రమ్ మరణించాడని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాధులో పేర్కొన్నారు. మృతుడి తండ్రి నారాగౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News