Monday, January 27, 2025

పెళ్ళి కార్డులు పంచేందుకు వెళ్ళి..పెళ్ళి కొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

మోత్కూరు: మరో వారం రోజుల్లో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నానని కలలు గంటున్న ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. పెళ్ళి నిశ్చయమై పెళ్ళి కార్డులు పంచి వస్తుండగా పెళ్ళి పెళ్లొకొడుకు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన వీరభద్ర కిరాణం యజమాని సకినాల వెంకటయ్య, ఉమారాణిల మూడో కుమారుడు శివకుమార్ (23) కు పెళ్ళి కుదిరి ఈనెల 18న వివాహం జరగనుంది, కుటుంబసబ్యులంతా పెళ్ళి పనుల్లో ఉండగా శివకుమార్ బంధువులకు పెళ్ళి పత్రికలు పంచుతున్నాడు. శనివారం పెళ్ళి కార్డులు పంచేందుకు తమ బంధువుతో కలిసి బైక్‌పై నల్లగొండ వెళ్ళారు.

కార్డులు పంచడంతో ఆలస్యమై రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా అమ్మనబోలు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బైక్ అదుపు తప్పి ఇద్దరూ కిందపడ్డారు. దీంతో శివకుమార్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా, వెనకాల కూర్చున్న అతని బంధువుకు గాయాలయ్యాయి. శివకుమార్ మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్ళి పనుల్లో ఉన్న ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అములుకొన్నాయి. మృతదేహానికి నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News