Wednesday, January 22, 2025

బాలానగర్‌లో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బైక్ వేగంగా వెళ్లి డిసిఎంను ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…అఖిల్(23) అనే యువకుడు బైక్‌ను అతి వేగంగా డ్రైవింగ్ చేయడంతో అదుపు తప్పింది. ఐడిపిఎల్ చౌరస్తా వద్ద ఉన్న డి మార్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లి డిసిఎంను బైక్ ఢీకొట్టడంతో అఖిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న బాలానగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బైక్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News