Monday, December 23, 2024

వర్షంలో బైక్ స్టంట్స్.. యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

ఇద్దరు యువకులు రీల్స్ కోసం వర్షంలో బైక్ స్టంట్స్ వారి ప్రాణాల మీదకు తెచ్చింది. వర్షంలో అతి వేగంగా బైక్ స్టంట్స్ చేస్తుండగా అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా బైక్ నడిపిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన రంగా రెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ వద్ద జాతీయ రహదారి 65పై ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో విషాదం నింపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News