Monday, January 20, 2025

బైక్ అదుపు తప్పి యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

కీసరః ద్విచక్ర వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం చీర్యాల్ గ్రామ పరిధిలో జరిగింది. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. అంబేద్కర్ నగర్‌కు చెందిన వంశీ (29) తన స్నేహితుడు సుమన్‌తో కలిసి ఆదివారం తెల్లవారు జామున యాదాద్రి జిల్లా రాజపేటకు ద్విచక్ర వాహనం పై బయలుదేరారు. చీర్యాల్ చౌరస్తా దాటాక ద్విచక్ర వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో వంశీ అక్కడి కక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ సుమన్‌ను స్థానికులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరకున్న పోలీసులు వంశీ కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసిన  మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News