Monday, December 23, 2024

బైక్ ఆదుపు తప్పి యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

బెజ్జూరుః బెజ్జూరు మండలంలోని అందుగులగూడ గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమిని గ్రామానికి చెందిన కొర్తే మోహన్ (23) అనే యువకుడు అందుగులగూడ గ్రామంలో శుభకార్యానికి వెళ్లి వస్తున్న క్రమంలో అతివేగంతో ద్విచక్ర వాహనంతో వస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం

అదుపు తప్పి గుంతలోకి దూసుకు పోవడంతో గుంతలో ఉన్న రాయికి ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. అతనికి భార్య, 9 నెలల కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లు తెలిపారు. వారి వెంట కానిస్టేబుల్ వెంకటేష్, హోంగార్డ్ మహేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News