Sunday, December 29, 2024

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..మేడ్చల్ జిల్లా బాచ్ పల్లికి చెందిన నుతక్కి నిఖిల్ కరీంనగర్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన నిఖిల్ మంగళవారం తెల్లవారుజామున తన కారులో కరీంనగర్ కు బయలుదేరాడు. అయితే మార్గమధ్యలో సిద్ధిపేల జిల్లా కొండపాక వద్ద కారు అదుపు తప్పి కల్వర్ట్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నిఖిల్ ఘటన స్థలంలోనే మృతి చెందాడు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి, మృతుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం నిద్ర మత్తే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News