Friday, December 27, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలైన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తూరు మండలం తీగాపూర్ గ్రామానికి చెందిన వేణుగోపాల్16) అనే యువకుడు వ్యవసాయ పొలం నుంచి ఇంటికి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో చేగూరు – తీగాపూర్ గ్రామాల శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వేణుగోపాల్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. విషయాన్ని తెలుసుకున్న వేణుగోపాల్ కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలిపించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు,కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమున్నచోట స్పీడ్ బ్రేకర్లు, సంజ్ఞ బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికులు వేడుకుంటున్నారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News