Thursday, January 23, 2025

రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట ః జమ్మికుంట పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు గుర్తు తెలియని రైలు ఢీకొని యువకుడు(34)  మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం రైల్వేస్టేషన్ సమీపంలోని ప్లైఓవర్ బ్రిడ్జీ వద్ద గుర్తు తెలియని డౌన్ లైన్‌లో రైలు ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు.

మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లేదని, నలుపు ఫుల్ షర్ట్, బూడిద రంగు నిక్కరు ధరించి ఉన్నాడని వివరించారు.  శవాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచామని, మృతుడి వివరాలు తెలిసినవారు రామగుండం రైల్వే హెడ్ కానీస్టేబుల్ తిరుపతి ఫోన్ నెంః 9949304574, 8712658604కి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News