చంద్రాపూర్: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా అంధారి పులుల అభయారణ్యంలో ఒక 23 ఏళ్ల యువకుడు పులి దాడిలో మృత్యువాత పడ్డాడు. గురువారం రాత్రి డోనీ గ్రామ సమీపంలో ఈ సంఘటన జరుగగా శుక్రవారం ఉదయం ఆ యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అటవీ అధికారి ఒకరు తెలిపారు. డోనీ గ్రామానికి చెందిన భరత్ రాందాస్ కోవా అనే యువకుడు పులి దాడిలో మరణించినట్లు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్ట జితేంద్ర రాంగావంకర్ తెలిపారు. ఫుల్జరీ గ్రామంలో పని మీద మరో ఇద్దరు యువకులతో కలసి మోటారు సైకిల్‌పై భరత్ వెళ్లివస్తుండగా వారి మోటారు సైకిల్ చెడిపోయింది. రోడ్డు పక్కన వీరు నిలుచుండగా పులి గాండ్రింపు విని తలోదిక్కున వీరు పారిపోయారు. భరత్‌పై పులి దాడి చేసి చంపి ఉంటుందని డిఎఫ్‌ఓ తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రాథమిక పరిహారం కింద రూ. 25,000 అందచేసినట్లు ఆయన చెప్పారు. ఆ ప్రాంతంలో నాలుగు పులులు సంచరిస్తున్నాయని, యువకుడిని చంపిన పులిని పట్టుకునేందుకు కెమెరా ట్రాప్‌లు ఆ ప్రాంతంలో అమర్చినట్లు ఆయన చెప్పారు.
పులి దాడిలో యువకుడి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -