- Advertisement -
సిటిబ్యూరోః రైల్వే పట్టాల పక్కన ఇన్‌స్టా రీల్స్ చేస్తుండగా రైలు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సనత్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…రెహమత్‌నగర్, శ్రీరామ్ నగర్‌లోని మదార్సాలో చదువుతున్న ముగ్గురు బాలురు ఇన్‌స్టా రీల్ చేసేందుకు శుక్రవారం మద్యాహ్నం సనత్‌నగర్ రైల్వేస్టేషన్ ట్రాక్ వద్దకు వెళ్లారు.
అందులోని మహ్మద్ సర్ఫారాజ్ (16) రైల్వే ట్రాక్ పక్కన ఇన్‌స్టా రీల్ చేస్తుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
- Advertisement -