మహబూబాబాద్: రేపు పెళ్లి అనగా ఆ ఇంట్లో బంధు మిత్రులతో సందేడే సందడి.. ఈ లోపే వరుడికి విద్యూత్ ప్రమాదం రూపంలో మృత్యువు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ అత్యంత దురదృష్టకరమైన సంఘటన మహబూబాబాద్ మండల పరిధిలోని కొమ్ముగూడెంలో గురువారం చోటు చేసుకుంది. మహబూబాబాద్ రూరల్ ఎస్సై రాంచరణ్ కథనం ప్రకారం. వివరాలు ఇలా ఉన్నాయి. భూక్యా బాలాజీ, క్రాంతిలకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒకే ఒక్క కుమారుడు భూక్యా యాకూబ్ (22) ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయగా కుమారుడు యాకూబ్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. హైదరాబాద్‌లో రైలు భోగీలకు రంగులు వేసే కాంట్రాక్టరుగా కొనసాగుతున్న యాకూబ్‌కు గార్ల మండలం పీక్లా తండాకు చెందిన మానికతో వివాహం నిశ్చయమైంది.
Also Read: నలుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్టు
ఈ మేరకు శుక్రవారం వారిద్దరి పెళ్లి జరుగాల్సి ఉంది. అందుకోసం వరుడు యాకూబ్ ఇంటికి బంధువులు చేరుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఇంట్లోని బోరును వేసేందుకు వెళ్లగా స్టాటర్ ఆన్ చేస్తుండగా విద్యూత్ వైరు భయటకు రావడాన్ని గమనించకపోవడంతో విద్యూత్ షాక్‌కు గురైయ్యాడు. దీంతో ఆయన చేతివేళ్లు స్టాటర్‌కు అతుక్కుపోయి కొద్ది సేపటికే కింద పడిపోయిన యాకూబ్‌ను గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన మానుకోటలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రి వైద్యుడు యాకూబ్‌ను పరీక్షించి అప్పటికే అతను మృతి చెందినట్లు దృవీకరించారు. దీంతో తమ కుమారుడు యాకూబ్ పెళ్లికి ముందు రోజే మరణించాడనే విషయం తెలుసుకుని కుటుంబసభ్యుల రోధనలతో తండాను ముంచేత్తింది.
తండాలో తీవ్ర యాకూబ్ మృతి విషాదం నెలకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై రాంచరణ్ తెలిపారు. పెళ్లి కావాల్సిన యూకూబ్ ఒకరోజు ముందే ఇలా విద్యూత్ షాక్‌తో ప్రమాదానికి గురై ఆకాల మృత్యుఒడిలోకి జరుకున్న విషయం జిల్లాలో పలువురిని కంటపడిపెట్టించింది.