Wednesday, January 22, 2025

పెళ్లి బరాత్ లో డాన్స్ చేస్తూ యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

కుభీర్ : పెళ్లి రిసెప్షన్ వేడుకలో డాన్స్ చేస్తూ యువకుడు మృతి చెందిన విషాద ఘటన కుభీర్ మండలంలోని పార్డి (కె) గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుని వివాహం శుక్రవారం భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది. శనివారం పార్డి (కె) లో వివాహ వేడుకకు సంబంధించి విందు నిర్వహించారు.

ఇందులో పెళ్లి కుమారుని సమీప బంధువు మిత్రుడు మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం (19) అనే యువకుడు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలి పోయాడు. ఇది గమనించిన స్థానికులు యువకుడి లేపి పరిశీలించగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో హుటాహుటిన వైద్య సేవల కోసం గాను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడు గుండెపోటుతో మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహన్ని శివుని గ్రామానికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News