Thursday, January 23, 2025

జిమ్‌కి వెళ్లి వచ్చి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం  : ఖమ్మం నగరంలో 48 గంటల వ్యవధిలో ఇద్దరు యువకులు గుండెపోటుతో మరణించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు రెండో కుమారుడైన మానుకొండ శ్రీధర్ రోజూ వారిగా సోమవారం ఉదయం జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసి అనంతరం ఇంటికి వచ్చిన కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లో వెళితే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బాలపేటకు చెందిన మానుకొండ రాధాకిశోర్ గతంలో కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశాడు. ఆయన ప్రస్తుతం ఖమ్మం నగరంలో విడిఎస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన రెండో కుమారుడు శ్రీధర్ (31) సోమవారం ఉదయం జిమ్‌కి వెళ్లాడు. జిమ్‌లో వ్యాయామం చేసి ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే శ్రీధర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

దీంతో అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. శ్రీధర్ మృతి చెందిన విషయం తెలిసుకున్న ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అదేవిధంగా ఖమ్మం నగర శివారులో అల్లీపురంలో అన్నం తీనేందుకు కూర్చోని అలానే ప్రాణాలు వదిలిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. గరికపాటి నాగరాజు అనే 33 ఏళ్ళ యువకుడు పెయింటింగ్ పనులు చేస్తుంటారు. ఉదయం కుటుంబసభ్యులతో సరదాగా గడిపిన తరువాత మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూర్చున్న ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయాడు. వెంటనే ఆటోలో ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.

గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. గడిచిన నాలుగు నెలల వ్యవధిలో ఆకస్మికంగా గుండెపోటుతో మరణించిన యువకుల సంఖ్య ఐదుకు చేరింది. సోమవారం మృతి చెందిన మానుకొండ శ్రీధర్ భౌతికకాయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. శ్రీధర్ మృతి పట్ల ఎంపిలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News