Monday, December 23, 2024

యువకుడు అదృశ్యం

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ : యాదగిరి గుట్ట్లకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వెళ్లిన యువకడు ఆదృశ్యమైన సంఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం….ఓల్డ్‌బోయిన్‌పల్లి ఎల్బీనగర్ కాలనీకి చెందిన కె.బీరయ్యకుమారుడు ఆశోక్‌కుమార్ (30) 2013లో బిటెక్ పూర్తి చేసి కొద్దికాలంగా మార్కెటింగ్ ఏజెంట్‌గా పనిచేసి ఉద్యోగాని వదిలేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈక్రమంలో ఈనెల 26నబయటకు వెళ్లాడు.

అనంతరం కొద్దిసేపటికి ఫోన్ చేసి నేను యాదగిరిగుట్టకు వెళ్తున్నాని ఫోన్‌లో చెప్పి ఫోన్ కట్‌చేసాడు.సోమవారం ఉదయంసైతం ఫోన్‌చేసి నాగూరు రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు ఫోన్‌చేసాడు.అనంతరం కొద్ది సేపటికి తన తండ్రి ఫోన్‌చేయగా స్విచ్చాఫ్ రావటంతో అనుమానం వచ్చిన తనతండ్రి బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News