Monday, December 23, 2024

గోదావరి నదిలో యువకుడి గల్లంతు

- Advertisement -
- Advertisement -

నూగూరు వెంకటాపురం : ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని అంకన్న గూడెం గోదావరి రేవు వద్ద సయ్యద్ రహమాన్ అనే యువకుడు స్నానానికని వెళ్లి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి గల్లంతయ్యాడు.వివరాలలోకి వెళితే.. మండల పరిధిలోని వీరభద్రారం గ్రామంలో శుక్రవారం జరిగిన వివాహానికి హైదరాబాద్ నుండి ఐదుగురు కారులో వచ్చి వివాహానికి హాజరుకాకుండానే గోదావరి నది వద్దకు స్నానానికి వెళ్లారు. అందులో రహమాన్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి గల్లంతు అయ్యాడు. తోటి స్నేహితులు ఫిర్యాదు మేరకు  వెంకటాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News