Wednesday, January 22, 2025

గణేశ్ నిమజ్జనంలో అపశృతి..చెరువులో మునిగి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్ మండలంలో గణేశ్ నిమజ్జనంలో అపశృతి దొర్లింది. వినాయక విగ్రహాన్ని నిమజ్జన చేసేందుకు వెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలంలోని రాజుబొల్లారం తండా మాజీ సర్పంచ్ మాంగ్య నాయక్ తన నివాసం వద్ద ఏర్పాటు చేసి వినాయక విగ్రహాన్ని నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. గణనాధుడిని నిమజ్జనం చేసేందుకు అందరూ చెరువు వద్దకు చేరుకున్నారు.

ఇదే క్రమంలో రాజబొల్లారం తండా గ్రామానికి చెందిన కరంతోడ్ సురేందర్ (26) ఒక మట్టి విగ్రహాన్ని తీసుకొని చెరువులోకి ప్రవేశించాడు. ప్రమాదవశాత్తు చెరువు నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వినాయక నిమజ్జనం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ అద్దాని సత్యనారాయణ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News