- Advertisement -
గద్వాల: జోగులాంబ గద్వాల్ జిల్లా కుర్వపల్లిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని శివ(21)గా గుర్తించారు. యువకుడు డబ్బులు కోసం ఇంట్లో గొడవపడినట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -