Tuesday, December 24, 2024

పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

త్రిపురారం ః యువకుడు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది.పోలీసులు , గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం త్రిపురారం మండలంలోని బొర్రాయిపాలెం గ్రామానికి చెందిన తంగెళ్లపల్లి శ్రీకాంత్‌చారి (26) తనకు పెళ్లి సంబందాలు కుదరటం లేదని మనస్థాపానికి గురై సోమవారం క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. మృతుడు శ్రీకాంత్‌చారి మిర్యాలగూడలోని జనరేటర్ మెకానిక్‌గా పనిచేస్తూ ఉన్నారు.

సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగి ఆవిషయం ఫోన్ ద్వారా తన స్నేహితుడికి సమాచారం తెలియజేశాడు. అతను మృతుడి బంధువులకు సమాచారం అందించగా వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్‌ తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. మృతుడి తండ్రి వెంటరత్నచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గుండు శోభన్ బాబు తెలిపారు.
బొర్రాయిపాలెంలో విషాదచాయలుః
గ్రామానికి చెందిన తంగళ్లపల్లి వెంటరత్నాచారి, భారతమ్మ దంపతుల చిన్న కుమారుడైన మృతుడు శ్రీకాంత్ చారి సౌమ్యుడిగా పలువురితో వ్యవహరించేవాడని , అందరితో కలివిడిగా ఉండే అతను ఇక లేడని నిజాన్ని అతని స్నేహితులు, బంధువులు , గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు.

స్వయం ఉపాధి కోసం మెకానిక్ వృత్తితో కుటుంబ పోషణలో పాలు పంచుకుంటూ ప్రశాంత జీవనం గడుపుపుతున్న వారి కుటుంబంలో అతని మరణం తీరని లోటును మిగిల్చిందని , శ్రీకాంత్‌చారి ఇక లేడన్న నిజంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని అంతిమ యాత్రలో అశేషంగా పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News