Sunday, December 22, 2024

క్షణికావేశంలో పురుగుల మందు తాగి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

సంగెం: క్షణికావేశంలో పురుగుల మందు తాగి యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం.. మండలంలోని మొండ్రాయి గ్రామానికి చె ందిన కడ్దూరి స్వామికి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. కాగా స్వామికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడైన కడ్దూరి బాబు(27) అశోక లైలాండ్ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

కాగా ఈనెల 21న బాబు ఇంటికి ఆలస్యంగా రావడంతో ఎక్కడికి వెళ్లి వచ్చావు అని అడగడంతో ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. వెంటనే గమనించిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న బాబు శుక్రవారం మృతిచెందినట్లు తెలిపారు. కాగా తన కుమారుడి మృతిపై మాకు ఎలాంటి అనుమానం లేదని శవ పంచనామా చేసి తమ కుమారుడి శవాన్ని అప్పగించాలని పోలీసులను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News