- Advertisement -
హైదరాబాద్: సిటీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని దిల్ సుఖ్ నగర్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి ఓ యువకుడిని దుండగుడు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రాత్రి సమయంలో తన స్కూటిపై వెళ్తున్న మనోజ్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తి దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మనోజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టోమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -