- Advertisement -
లోన్ యాప్‌ల ఏజెంట్ల వేధింపులను తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం…కామారెడ్డి జిల్లా, సదాశివనగర్‌కు చెందిన సందీప్(29) నగరంలో ఉంటున్నాడు. సందీప్ లోన్ యాప్‌లో రుణం తీసుకుని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిపెట్టాడు. దీంతో డబ్బులు మొత్తం పోయాయి, డబ్బులు తిరిగి కట్టకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్లు సందీప్ ఇంటికి వెళ్లి విషయం తల్లిదండ్రులకు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న సందీప్ నగరంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -