Friday, January 31, 2025

యువకుడి ఆయువు తీసిన ఆన్‌లైన్ ఆట

- Advertisement -
- Advertisement -

ఆన్‌లైన్ ఆట..యువకుడి ఆయువు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం, గద్దపాక గ్రామానికి చెందిన బూస కార్తీక్ (25) ఆత్మహత్య చేసుకున్నాడు. అంతర్జాలంలో రమ్మీ ఆడుతూ అప్పులపాలయ్యాడు. ఈ అప్పులు తీర్చే మార్గం కానరాక మనస్థాపానికి గురై క్రిమిసంహారక మందు తాగాడు. ఈనెల 28న వ్యవసాయ పనుల నిమిత్తం వాగు వద్దకు వెళ్లి క్రిమిసంహారక మందు సేవించి తన స్నేహితునికి చెప్పాడు. విషయం తెలుసుకున్న మృతుడి తండ్రి బూస శంకర్ సంఘటన స్థలానికి వెళ్లి కార్తీక్‌ను జమ్మికుంటలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లా. అనంతరం వైద్యుల సూచన మేరకు హన్మకొండలోని మరో ప్రయివేటు ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమించి గురువారం రాత్రి కార్తీక్ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కేశవపట్నం ఎస్‌ఐ కొత్తపల్లి రవి శుక్రవారం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News