Friday, December 20, 2024

తొలిసారిగా అత్తగారింటికి వెళ్లిన యువకుడు..ఏమైందంటే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తొలి సారిగా అత్తగారింటికి వెళ్లిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ లోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని హస్తినాపురానికి చెందిన యువతి గోపినాయక్ లు ప్రేమించుకున్నారు. అయితే వాళ్ల ప్రేమ వ్యవహరం ఇంట్లో తెలిసింది. ఇద్దరు కులాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో పెద్దల్ని ఎదురించి ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు.

ప్రేమ వివాహం చేసుకున్న గోపినాయక్ దంపతులను యువతి తల్లిదండ్రులు గత రెండు రోజుల క్రితం ఇంటికి పిలిపించారు. అయితే నిన్న గోపినాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. గోపి నాయక్ మృతిపై అతని కుటుంబ సభ్యులు అనుమానం ఉన్నట్లు వనస్థలిపురం పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News