Monday, December 23, 2024

బావిలో దూకి యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

యాలాల: మనస్థాపానికి గురై బావిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రమైన యాలాల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబందించి యాలాల పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల గ్రామానికి చెందిన ఉప్పలి రామయ్య, ఎల్లమ్మ దంపతుల కుమారుడు ఉప్పలి సాయిలు(26) గత ఐదు, ఆరు సంవత్సరాల క్రితం పెద్దెముల్ మండలం గొట్లపల్లి గ్రామానికి చెందిన అంబమ్మకు ఇల్లరికం వెళ్ళాడు. ఆయనకు నాలుగు సంవత్సరాల కూతురు. అయితే భార్య భర్తల మధ్య ఎం జరిగిందనేది తెలియదు కాని గత రెండు నెలల నుంచి తన స్వంత గ్రామమైన యాలాల లోనె ఉంటు బ్రతుకుతున్నాడు.

ఈ క్రమంలోనే గురువారం ఎవరికి చెప్పపెట్టకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. బాకారం ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలోగల ఎరకలి రామయ్య బావిలో శవమై తేలాడు. అటుగా వెళ్ళుతున్న బాటసారులు అది గమనించి యాలాల పోలీసులకు సమాచ్చారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి శవాని బయటకు తీశారు. యాలాల గ్రామానికి చెందిన ఉప్పలి సాయిలుగా గుర్తించి, పోస్టు మార్టం నిమిత్తం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అరవింద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News