Thursday, January 23, 2025

తండ్రి మందలించడంతో యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సుల్తానాబాద్: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రినగర్‌కు చెందిన మారవేణి అరవింద్ (23) అనే యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని సుల్తానాబాద్ ఎస్‌ఐ ఉపేందర్‌రావు తెలిపారు. ఇతడు సోమవారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లి గడ్డి మందు తాగాడు. వెంటనే ఇతన్నికొందరు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి, తర్వాత హైదరాబాద్‌లోని మరొక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స జరిపించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. వ్యవసాయ పనులకు వెళ్లకుండా తిరుగుతున్నాడని తండ్రి మందలించడంతో కలత చెంది ఇతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లి శంకరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News