Monday, March 10, 2025

రాయదుర్గంలో విషాదం..ప్రియురాలికి వీడియో పంపి.. యువకుడు ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌లో సూపర్వైజర్‌గా పని చేస్తున్న వర్మ ప్రధాన్(30) అనే వ్యక్తి.. సెల్ఫీ వీడియో తీసుకుని ప్రియురాలికి పంపి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రేమ వ్యవహారమే అతని మృతికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెందిన వర్మను ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. అనంతరం ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News