- Advertisement -
ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టపోయి అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీస స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తెలేకలాన్ గ్రామానికి చెందిన చెనమోని శివలింగం (28) ఇబ్రహీంపట్నం ఐడిఎఫ్‌సి బ్యాంక్‌కు సంబంధించిన ఫైనాన్స్ విభాగంలో పనిచేసేవాడు.
గత కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 15న ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అతనిని నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
- Advertisement -