Wednesday, January 22, 2025

లక్డారం చెరువులో పడి యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం లక్డారం చెరువులో పడి యువకుడు మృత్యువాత పడ్డాడు. మృతుడిని జోగన్నగా గుర్తించారు. నిన్న రాత్రి ఇద్దరు స్నేహితులు సాయి కుమార్, రాజుతో కలిసి జోగన్న మద్యం సేవించాడు. మద్యం మత్తులో జోగన్న చెరువులో పడిపోయాడు. ఇద్దరు స్నేహితులు జోగన్నను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. బయటకు రాకపోవడంతో వదిలిపెట్టి వెళ్లిపోయారు. జోగన్న చనిపోవడంతో గ్రామస్థులు రాజు, సాయికుమార్ పై దాడి చేశారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News