Sunday, December 22, 2024

ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరణ.. ఇద్దరిని కాల్చి చంపిన యువకుడు

- Advertisement -
- Advertisement -

ప్రేమించిన యువతితో పెళ్లికి ఒప్పుకోలేదని
ఇద్దరిని కాల్చి చంపిన యువకుడు
బీహార్‌లోని లఖీసరాయ్‌లో దారుణం
పాట్నా: ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించిన ఆమె కుటుంబ సభ్యులపై ఒక వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో ఈ కాల్పుల సంఘటన జరిగింది. సోమవారం ఉదయం ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు ఛత్ పూజ తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురింట్లో ఉండే యువకుడు పిస్టల్‌తో వారిపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో యువతి ఇద్దరు సోదరులు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన నలుగురుని ఆసుపత్రికి తరలించారు.

నిందితుడిని ఆశిష్ చౌదరిగా పోలీసులు గుర్తించారు. ఆ కు టుంబానికి చెందిన యువతిని అతడు ప్రేమిస్తున్నాడని చెప్పారు. అయితే అతడితో పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారని, పది రోజుల కిందట ఈ విషయంపై వారి మధ్య గొడవ జరిగినట్లు తెలిసిందని అన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక టీమ్స్ ను రంగంలోకి దించినట్లు పోలీస్ అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News