రమావత్ మధుసూదన్ అనే యువకుడు మూడు సంవత్సరాల వ్యవధిలో 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. మధుసూదన్ స్వస్ధలం సూర్యపేట జిల్లా నేరేడు చర్ల .సోమవారం వెలువడిన ఐబిపిఎస్ ఫలితాల్లో పివో కేడర్ లో కెనరాబ్యాంకులో ఉద్యోగాన్ని సాధించాడు.2020 లో బిటెక్ సూర్తి చేసిన మధుసూదన్ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బిటెక్ లో 60 శాతం మార్కలతో పాసైనాడు. ఒక సంవత్సరం బ్యాంకు ఉద్యోగం కోసం తీవ్రంగా శ్రమించాడు.తొలి ప్రయత్నంలో ఉద్యోగం రాకపోయినా కుంగిపోలేదు. ఆ తర్వాత వరుసగా ఐబిపిఎస్, ఎస్బిఐ తో పాటు పలు బ్యాంకుల నుంచి నోటిఫికేషన్ విడుదలయ్యాయి.
అప్పటికే కోర్సు పూర్తి చేసిన మధుసూదన్ పరీక్షలు రాయగా మొదటగా క్టర్క్, ఆఫీసర్ కేడర్ ఉద్యోగాలు దక్కాయి.ఆ తర్వాత ఎస్బిఐ పివో (కర్ణాటక) గాఎంపికవడంతో ఉద్యోగంలో చేరాడు.ఎల్ఐసి ఏఏవో, ఎన్ఐఎసిఎల్ ఏవో, ఎఫ్ సిఐ లో అసిస్టెంట్ గ్రేడ్-3,ఐడిబిఐలో అసిస్టెంట్ మేనేజర్,ఆర్ఆర్బి, ఐబిపిఎస్,ఐడిబిఐ విభాగాల్లో క్లరికల్ ఉద్యోగాలు, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ క్లరికల్, టిఎస్ క్యాబ్ లో మేనేజర్ గా ఎంపికయ్యాడు. తర్వాత తెలంగాణలో గ్రూప్ నోటిఫికేషన్లు రాడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ పరీక్షలకు సిద్ధమయ్యడు. ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నట్టు పేర్కొన్నాడు.