- Advertisement -
మహబూబాబాద్: ఓ వివాహితను ఓ యువకుడు వేధించిడంతో అతడిపై కేసు నమోదు చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలు కలిసి జీవనం సాగిస్తోంది. భర్త అనారోగ్యానికి గురికావడంతో ఆమె ఇంటిని పోషిస్తుంది. మానుకొట మండలం మాధవాపురం గ్రామానికి చెందిన రాకేష్‌తో వివాహితకు పరిచయం ఏర్పడింది. రాకేష్ పలుమార్లు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. వేధింపులు భరించలేక ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -