Friday, November 22, 2024

సోషల్ మీడియాలో ప్రేమ పేరుతో వేధింపులు… రామన్నపేటలో యువకుడు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Young man harassment women in Social media

యాదాద్రి భువనగిరి: సోషల్ మీడియాలో ప్రేమ పేరుతో ఓ యువతిని యువకుడు వేధించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చాపల ప్రవీణ్ అనే యువకుడు మగ్గం పనులు జీవనం సాగిస్తున్నాడు. బాధితురాలు తన నానమ్మ ఇంటికి వచ్చింది. దీంతో సదరు యువతికి మాయమాటాలతో స్నేహం చేశాడు. కొన్ని రోజుల తరువాత యువతి తన సొంతింటికి వెళ్లిపోయింది. ఇన్ స్టాగ్రామ్ లో యువతి ప్రేమిస్తున్నాని తెలిపాడు. దీంతో అతడి ప్రేమను యువతి తిరస్కరించడంతో కొపంతో రగిలిపోయాడు. ఫేక్ ఐడిని సృష్టించి బాధితురాలుకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమెతో చాటింగ్ చేస్తూ పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు. తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ప్రవీణ్ గా గుర్తించారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News