Monday, December 23, 2024

యువకుడిపై అత్యాచార ఆరోపణలు.. పెరోల్ పై వచ్చి వివాహం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రేమించిన యువతిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలున్న ఓ యువకుడు, బాధిత యువతిని పెళ్లి చేసుకోవడం కోసం నాలుగు గంటల పాటు పెరోల్ పై విడుదలైన ఘటన బిహార్ లో చోటుచేసుకుంది. యువకుడు హాజీపూర్ కు చెందిన వాడు, బాధిత యువతి ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అమ్మాయి. వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో ఓరోజు రాత్రి యువకుడు తన స్నేహితుని ఇంటికి తన ప్రేయసిని తీసుకుని వెళ్లాడు. ఆ రాత్రి జరిగిన ఘటనతో యువతి ఆరోగ్యం క్షీణించింది. ఆందోళనకు గురైన యువకుడు ఆసుపత్రికి తీసుకెల్లగా యువతి అత్యాచారానికి గురైనట్లు డాక్టర్లు నిర్దారించారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడిని అరెస్టు చేసారు. తాను అత్యాచారం చేయలేదని, ఇద్దరం ప్రేమించుకున్నామని కోర్టులో తెలిపిన నిందితుడు బాధిత యువతిని పెళ్లి చేసుకునేందుకు అనుమతి కోరాడు. పెరోల్ పై విడుదలై వచ్చి వివాహం చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News