Monday, December 23, 2024

యువకుడిపై పోలీసుల థర్డ్‌డిగ్రీ…?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విచారణ పేరుతో యువకుడిని చితక బాదిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. భార్యభర్తల కేసు విచారణలో తనను తీసుకుని వచ్చి దారుణంగా కొట్టి, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడు ఆరోపించాడు. గాయలు తీవ్రం కావడంతో బాధితుడు కొండాపూర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అయితే ఆస్పత్రి ఖర్చులు భరించలేకపోవడంతో గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. ఈ విషయం సైబరాబాద్ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో విచారణకు కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశించారు. గుంటూరు జిల్లాకు చెందిన మొవ్వా ప్రణీత్‌కు అదే జిల్లాకు చెందిన శ్రీలక్ష్మితో 2018లో వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య విబేధాలు రావడంతో శ్రీలక్ష్మి, ప్రణీత్‌పై గుంటూరులోని దిశ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది.

ఈ క్రమంలోనే ఇద్దరు వేర్వేరుగాఉంటున్నారు. ప్రణీత్ హైదరాబాద్‌లో ఓ బ్యాంకులో మేనేజరుగా పనిచేస్తున్నాడు. తన సర్టిఫికెట్లు తన భర్త వద్దే ఉన్నాయని గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో మరోసారి శ్రీలక్ష్మి ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో ఉండగా మళ్లీ కేసు నమోదు చేయమని నల్లపాడు పోలీసులు వెనక్కి పంపించారు. దీంతో నగరాకిని వచ్చిన శ్రీలక్ష్మి, ప్రణీత్ నిజాంపేట్‌లో ఉండడంతో కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ నిమిత్తం శనివారం స్టేషన్‌కు పిలిపించి ప్రణీత్‌ను ఇన్‌స్పెక్టర్, ఓ ఎస్‌ఐ విచక్షణ రహితంగా కొట్టినట్లు తెలిసిందిత. తనపై అప్పటికే కేసు నమోదై విచారణలో ఉన్నట్లు ప్రణీత్ తెలిపినా పోలీసులు వినిపించుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీలక్ష్మి సర్టిఫికెట్స్ ఇవ్వాలని కొట్టారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు తనపై విచక్షణ రహితంగా దాడి చేశారని బాధితుడు చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా సైబరాబాద్ సీపీకి బాధితుడు ప్రణీత్ ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News