Monday, January 20, 2025

పుట్టిన రోజు వేడుకలకు పిలిచి స్నేహితుడిని హత్య చేసిన స్నేహితులు

- Advertisement -
- Advertisement -

పుట్టిన రోజు వేడుకలకు పిలిచి యువకుడిని హత్య చేసిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…బాలానగర్‌కు చెందిన రోహిత్ కుమార్ సింగ్(25) తన స్నేహితుడు అక్బర్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి అల్కపూరి కాలనీకి వచ్చాడు. రోహిత్ కుమార్, గోల్కొండకు చెందిన అక్బర్, అఫ్రోజ్ యువకుడు కలిసి ఫుల్‌గా మద్యం తాగారు. ముగ్గురు నిందితులు వివాదాస్పద భూముల తగాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేసేవారని తెలిసింది. భూ వివాదంలో ముగ్గురి మధ్య గొడవ జరగడంతో రోహిత్ తలపై ఇద్దరు మద్యం బాటిళ్లతో దాడి చేశారు.

దాడితో తీవ్ర గాయాలు కావడంతో రోహిత్ కిందపడడంతో ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అల్కాపురి టౌన్‌షిప్‌లోని రోడ్డు నంబర్10లోని నిర్మాణంలో ఉన్న భవనంలో ఓ యువకుడు పడి ఉన్నట్లు డయల్ 100కు ఫోన్ రావడంతో నార్సింగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన రోహిత్‌ను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యువకుడిని హత్య చేసిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News