Sunday, April 13, 2025

యువకుడిని గొంతునులిమి హతమార్చిన ట్రాన్స్‌జెండర్లు

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ జిల్లా, మల్దకల్ మండల కేంద్రానికి చెందిన రామక్రిష్ణ (25) అనే యువకుడు తనతో కలిసి తిరగడం లేదని, ఈ మధ్యకాలంలో ఫోన్ మాట్లాడడం లేదనే నెపంతో గద్వాలకు చెందిన ట్రాన్స్‌జెండర్ శివాణితో పాటు మరో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు గొంతునులిమి హతమార్చారు. మృతుడి బంధువుల కథనం ప్రకారం..రామక్రిష్ణ ఇంట్లో ప్రవేశించి వారు తలుపులు వేసి నోట్లో బట్ట పెట్టి గొంతునులిమి, విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో గమనించిన ట్రాన్స్‌జెండర్లు నలుగురు కలిసి ఓ వాహనంలో

జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించగా మృతి చెందాడని చెప్పడంతో అక్కడి నుండి వారు పారిపోయారు. తన సోదరి వివాహానికి కుటుంబ సభ్యులందరూ వెళ్లడంతో వారితో పాటు రామక్రిష్ణ కూడా వివాహానికి బయల్దేరే సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ట్రాన్స్‌జెండర్ శివాణి అమ్మ పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు సమాచారం. కాగా, మృతుడికి నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం కాగా ప్రస్తుతం ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నట్టు సమాచారం. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News