Tuesday, December 24, 2024

లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని హత్య చేసిన యువతి

- Advertisement -
- Advertisement -

ములుగు : లైంగికంగా వేధిస్తున్నాడని వ్యక్తిని యువతి దారుణంగా హత్య చేసిన సంఘటన ఏటూర్ నాగారం మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఏటూర్ నాగారం మండల కేంద్రంలోని 3వ వార్డుకు చెందిన రాంటెంకి శ్రీను (32), జాడి సంగీత ను గత కొంత కాలంగా లైంగికంగా వేధిస్తుండడంతో యువతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టగా శ్రీను ఇటీవల జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుండి వచ్చిన అతను పద్దతి మార్చుకోకుండా మళ్లీ వేధింపులకు దిగాడు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి దాదాపు 11 గంటల సమయంలో శ్రీను యువతి ఇంటికి వెళ్లి తలుపు తీయాలని బలవంతం చేయగా కాసేపటికి తలుపు తీసిన యువతి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం శ్రీనును ఇంటిలోకి రాగానే అక్కడ ఉన్న దోమ తెర, ఒక వైరుతో కట్టి ఇంటి ముందు ఉన్న షెడ్డు పోల్‌కు బంధించింది. అనంతరం కత్తితో పలుమార్లు శ్రీను ని పొడిచి హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగి పోయింది. హత్యకు వాడిన కత్తిని క్రాస్ రోడ్ పాత బస్ డిపో వద్ద పారేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News