Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే… స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లోని అన్నారం గేట్ సమీపంలో చెరుకు ట్రాక్టర్ ను వెనుక నుండి బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హలవత్ గణేష్ వయసు 26 సంవత్సరాలు యువకుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై స్థానికులను అడిగి తెలుసుకొని, పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిది పిట్లం మండలం పోతేపల్లి తాండ వాసిగా పోలీసులు గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News