Friday, December 27, 2024

నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దారుణంగా ఓ యువకుడిని హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే .. ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు గొడ్డలి, కత్తులతో వెంబండించారు. జనమంతా చూస్తుండగానే సిరిచెల్మ చౌరస్తాలో ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో దారుణంగా హతమార్చారు. హత్యకు గురైన యువకుడిని వాములే ఈశ్వర్‌గా స్థానికులు గుర్తించారు. మండలంలోని గాంధీవాగు గ్రామానికి చెందిన ఈశ్వర్ ఇచ్చోడ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మృతుని బాబాయ్ పాండురంగ్, అతని కుమారుడు సూర్యకాంత్ ఈ హత్య చేసి పరారీ అయ్యారని పోలీసులు తెలిపారు. భూ తగాదాలతోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోందని అన్నారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News