Wednesday, December 25, 2024

వరంగల్ జిల్లాలో దారుణం

- Advertisement -
- Advertisement -

వరంగల్ జిల్లాలో దారుణ ఘటనా చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తల్లిదండ్రులను అత్యంత దారుణంగా హత్య ఛేశాడు. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … బానోతు శివ , సుగుణ వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం చింతల్ తండాకు చెందిన వారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు దీపికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడు. అయితే దీపిక అతని ప్రేమను తిరస్కరించింది. దీంతో దీపిక పై కోపం పెంచుకున్న బన్నీ గురువారం ఉదయం కత్తితో దీపిక ఇంటికి వచ్చి ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు.

ఈ ఘటనలో దీపిక తల్లిదండ్రులు ఘటనా స్థలిలోనే మృతి చెందారు. అడ్డొచ్చిన దీపిక, ఆమె సోదరుడిపై బన్నీ దాడి చేశాడు. దీపిక, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందుతుడిని అరెస్ట్ చేశారు. తీవ్రంగా గాయపడిన దీపిక, ఆమె సోదరుడిని చికిత్స నిమిత్తం పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News