70 సంవత్సరాల వృద్ద్ధురాలిని ఓ యువకుడు చంపి ఆమె మృతదేహంపై డ్యాన్స్‌లు చేసి సెల్ఫీ వీడియోలు తీసుకుని తన మిత్రులకు పంపిచిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… రాజస్థాన్‌కు చెందిన పుబ్‌రాజుచౌదరి కమలాదేవి దంపతులు చాల కాలం క్రితమే హైదరాబాద్‌కు వలస వచ్చి కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌కాలనీలో జీవిస్తున్నారు. గత పది సంవత్సరాల క్రితం కమలాదేవి భర్త పుబ్‌రాజ్‌చౌదరి అనారోగ్యంతో మృతి చెందాడు. పిల్లలు లేకపోవడంతో అప్పటి నుంచి కృష్ణానగర్‌కాలనీలోని తన నివాసంలో కమలాదేవి ఒంటరిగా ఉంటుంది. తన నివాసంలో రెండు షటర్లు కిరాయికి ఇచ్చి వచ్చే అద్దెలతో జీవిస్తుంది. అద్దెకున్న హర్డ్‌వేర్ షాపులో ఓ యువకుడు పని చేస్తున్నాడు.
ఇటీవల అద్దె విషయంలో యువకుడిని కమలాదేవి మందలించింది. అప్పటి నుంచి కోపం పెంచుకున్న యువకుడు ఆమెను హతమార్చాలని పథకం వేసినట్టు తెలిసింది. ఈనెల 11వ తేదీన ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కమలాదేవిని యువకుడు తలపై బాది హత్యచేసి ఆపై మృతదేహం వద్ద డ్యాన్స్‌లు చేస్తూ వీడియోలు తీసుకుని తన మిత్రులకు పంపించాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమెకు ఉరివేసి ఇంటికి తాళం వేసి పారిపోయాడు. సోమవారం ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తాళం పగులగొట్టి చూడగా కుళ్లిన రూపంలో కమలాదేవి పడి ఉంది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లోని సిసి కెమెరాలను పరిశీలించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని హత్య ఎందుకు చేశారనే కోణంలో విచారిస్తున్నట్టు తెలిసింది. నిందితులలో ఒకరు మైనర్ ఉన్నట్టు తెలిసింది.