రంగారెడ్డి: ఆన్ లైన్ యాప్ లోన్ పేరుతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ ఆర్జీఐఏ పోలిస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కరీంనగర్ ప్రాంతనికి చెందిన నరేష్ (20) సంవత్సరం క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగనికి చేరి శంషాబాద్ ఆర్బీనగర్ లో లక్కి డీలక్స్ బాయిస్ హాస్టల్ లో ఉంటున్నాడు. అయితే నరేష్ ఫోన్ కు ప్రవేట్ లోన్ యాప్ ద్వారా మెసేజ్ వచ్చింది. దీంతో దానికి నరేష్ స్పందించి ఆప్ నుండి లోన్ తీసుకున్నాడు. దీంతో యాప్ లోన్ కు సంబంధించిన డబ్బులు నెల నెలకు చెల్లిస్తున్నాడు. కానీ డబ్బులు ఇంకా రావాలి అంటూ నరేష్ వేదింపులకు దిగారు.
అన్ లైన్ యాప్ సిబ్బంది దీంతో నరేష్ మనస్థాపానికి గురై తాను ఉంటున్న హస్టల్ లో మోనోస్టార్ అనే పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలిసులు సంఘటనా స్థలనికి చేరుకుని నరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మర్చరికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నరేష్ ఆత్మహత్యకు కారకులైన నిందుతులను గుర్తించి చర్యలు చేపట్టేందుకు సిద్దం అయ్యరు. గుర్తుతెలియని లోన్ యాప్ భారిన యువత పడవద్దని సెల్ ఫోన్ లకు వచ్చే గుర్తుతెలియని మెసేజ్ లకు స్పందిచ వద్దని పోలిసులు తెలిపారు. ఎవరైన గుర్తుతెలియని వ్యక్తులు పోన్ చేసి వివరలను అడుగుతే స్పందించకూడదని వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలని తెలిపారు. హాస్టల్ మేనేజర్ తెలిపారు.