Sunday, December 22, 2024

నిరుద్యోగానికి యువకుడి బలి

- Advertisement -
- Advertisement -

ఓ యువకుడు ఉద్యోగం రాక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడపలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. వరంగల్ జిల్లా చెన్నారావు పేటకి చెందిన రంజిత్ పలు పోటీ పరీక్షలు రాశాడు. అయిన ఉద్యోగం సాధించ లేకపోయాడు. రెండు రోజుల క్రితం తన స్నేహితుడి అక్క పెళ్లికి కడప కు వెళ్లాడు, అక్కడ లాడ్జిలో ప్రెండ్స్ తో గడిపాడు. తల్లిదండ్రలు ఆశలు నేరవేర్చలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ లెటర్ ను గుర్తించారు. అందులో అమ్మ నాన్న మీ కోరిక మేరకు ను ఉద్యోగం తెచ్చుకోలేకపోయాను,ఉద్యోగం వస్తాదని ఎంతో ఆశగా ఎదురు చుశా నా చావుకు నిరుత్యోగమే కారణం,నన్ను క్షమించండి అమ్మ నాన్న అని సూసైడ్ నోట్ లో రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News